పంజాబ్‌‌ తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌ లో..హైదరాబాద్‌‌ 380 ఆలౌట్‌‌

పంజాబ్‌‌ తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌ లో..హైదరాబాద్‌‌ 380 ఆలౌట్‌‌

సికింద్రాబాద్‌‌, వెలుగు: పంజాబ్‌‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌‌ గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ ఆధిక్యం సాధించలేకపోయింది. అభిరత్‌‌ రెడ్డి (97), రాహుల్‌‌ రాధేశ్‌‌ (86), హిమతేజ (81), ప్రజ్ఞయ్‌‌ రెడ్డి (65) హాఫ్‌‌ సెంచరీలు సాధించినా ప్రయోజనం దక్కలేదు. 193/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో బుధవారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 119.5 ఓవర్లలో 380 రన్స్‌‌కు ఆలౌటైంది. 

లోయర్‌‌ ఆర్డర్‌‌లో చామ మిలింద్‌‌ (2), రుతిక్‌‌ మెండె (1), తనయ్‌‌ త్యాగరాజన్‌‌ (2), అనికేత్‌‌ రెడ్డి (1), రక్షణ్‌‌ రెడ్డి (0 నాటౌట్‌‌) నిరాశపర్చారు. విహాన్‌‌ మల్హోత్రా 4 వికెట్లు తీశాడు. 51 రన్స్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ ఆధిక్యంతో బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ ఆట ముగిసే టైమ్‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌లో 24 ఓవర్లలో 57/0 స్కోరు చేసింది. విహాన్‌‌ మల్హోత్రా (26 బ్యాటింగ్‌‌), హర్నూర్‌‌ సింగ్‌‌ (27 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.