న్యూజిలాండ్‌‌ తో ఐదు మ్యాచ్‌‌ ల వన్డే సిరీస్‌‌ కు ప్రసిధ్‌‌ కృష్ణ ఔట్‌‌

న్యూజిలాండ్‌‌ తో ఐదు మ్యాచ్‌‌ ల వన్డే సిరీస్‌‌ కు ప్రసిధ్‌‌ కృష్ణ ఔట్‌‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో  పేసర్‌‌ ప్రసిధ్‌‌ కృష్ణ ఈ సిరీస్‌‌ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న  ప్రసిధ్‌‌కు బెంగళూరులోని సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌లో నవంబర్‌‌ 1, 2వ తేదీల్లో ఫిట్‌‌నెస్‌‌ పరీక్షలు జరగనున్నాయి. 

వన్డేల కంటే టెస్ట్‌‌లకు ప్రసిధ్‌‌ను పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. విండీస్‌‌తో జరిగిన వన్డే సిరీస్‌‌లో ప్రసిధ్‌‌కు ఈ గాయమైంది. న్యూజిలాండ్‌‌–ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌‌ మ్యాచ్‌‌లో రాణిస్తున్న జమ్మూ కశ్మీర్‌‌ పేసర్‌‌ అకిబ్‌‌ నబీని వన్డే సిరీస్‌‌కు ఎంపిక చేసే అవకాశాలున్నాయి.