కొచ్చి: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో.. ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్‌కు భారీ ధర పలికింది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ మోలినెక్స్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, మాజీ వికెట్ కీపర్ సుష్మా వర్మ, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్‌ను కూడా యూపీ జట్టు దక్కించుకుంది. వీళ్లకు ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున ఖర్చు చేసింది.
జి. కమలినిని గుజరాత్ జెయింట్స్ రూ. 40 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. కిరణ్ నవగిరే రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లింది. దిశా కసత్, సనిక చల్కే, భారతీ రావల్, ఇనామ్‌దార్‌కు తలా పది లక్షల చొప్పున ముంబై ఇండియన్స్ తీసుకుంది. జెస్ జోనాసెన్‌ను రూ. 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
