కరువుపై కేటీఆర్, హరీశ్తప్పుడు ప్రచారం..గాంధీ భవన్ ఎదుట దిష్టిబొమ్మల దహనం

కరువుపై కేటీఆర్, హరీశ్తప్పుడు ప్రచారం..గాంధీ భవన్ ఎదుట దిష్టిబొమ్మల దహనం

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ కరువుపైనా రాజకీయాలు చేస్తున్నారని, ఎల్​నినో కారణంగా కరువు వస్తే కాంగ్రెస్​వల్లే కరువు వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. బుధవారం గాంధీ  భవన్ ఎదుట పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం కేటీఆర్, హరీశ్ ఫ్లెక్సీలను, దిష్టి బొమ్మలను దహనం చేశారు.

చనగాని దయాకర్ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు వల్ల వచ్చిన కరువును కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్ కు అంటగడుతున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే.. ఇద్దరినీ బయట తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు .