- రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వార్నింగ్
ఇబ్రహీంపట్నం, వెలుగు : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల చెల్లింపులను వారంలోగా చేయాలని రైస్ మిల్లర్లను రంగారెడ్డి జిల్లా అడిషనల్కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం కొంగరకలాన్కలెక్టరేట్లో సీఎంఆర్ తిరిగివ్వని మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
చంద్రారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2014–-15 నుంచి ఖరీఫ్ 2024-–25 వరకు ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 17 ప్రకారం రైస్ మిల్లర్లు తమ దగ్గర ఉంచుకున్న బియ్యం తిరిగివ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ముగ్గురు రైస్ మిల్లర్ల నుంచి రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం ఇవ్వాలని తెలుస్తున్నది. డీఎస్వో వనజాత, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.
