- ‘మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్’తో15 సెకన్లలోనే ఫేస్ రికగ్నేషన్
- సీఐడీలో ఏడు సాంకేతిక సేవలు ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పోలీస్ సేవల పట్ల ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వేగవంతమైన దర్యాప్తు కోసం ఏడు డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సీఐడీ రూపొందించిన ప్రత్యేక యాప్స్‌ను సీఐడీ డీజీ చారుసిన్హాతో కలిసి డీజీపీ సీవీ ఆనంద్మంగళవారం ప్రారంభించారు.
నేరాల దర్యాప్తులో ఆధారాల సేకరణ, విశ్లేషణ మరింత వేగవంతం కోసం సిటిజన్ ఫీడ్‌బ్యాక్, మొబైల్ ఫేస్సెర్చ్, ఫింగర్ ప్రింట్స్ సేకరణ కోసం దేశంలోనే తొలిసారిగా వినియోగిస్తున్న ‘క్రైమ్‌సీన్ చాన్స్ ప్రింట్’ పోలీసింగ్‌లో కీలకం కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏడు యాప్స్వివరాలను డీజీపీ వెల్లడించారు.
పోలీసుల ప్రవర్తనపై ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్’
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారు, పోలీస్సేవల గురించి తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు చేసే పిటిషనర్లకు కాల్స్‌చేసి సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు అభిప్రాయాలను సేకరించనున్నారు. పిటిషన్ల స్వీకరణ, ఎఫ్ఐఆర్ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్వంటి సేవలపై ప్రజలు తెలిపే వివరాల ఆధారంగా లోటుపాట్లను గుర్తించి సరైన చర్యలు తీసుకోనున్నారు.
మహిళలు, బాలికలకు సమగ్ర సాయం అందించే భరోసా కేంద్రాల పనితీరును డిజిటలైజ్చేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 భరోసా కేంద్రాల సేవలను ఒకే వేదికపై పర్యవేక్షించవచ్చు. బాధితులకు అందించే కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస సేవల వివరాలను నమోదు చేయడంతోపాటు కేసు ప్రారంభం నుంచి పరిష్కారం వరకు పురోగతిని తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఫింగర్ ప్రింట్స్ కోసం దేశంలోనే తొలిసారిగా ‘క్రైమ్‌సీన్ చాన్స్ ప్రింట్’
నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడే అనుమానితుల ఫింగర్ప్రింట్స్కోసం దేశంలోనే తొలిసారిగా ‘క్రైమ్సీన్చాన్స్ ప్రింట్’ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఘటన స్థలంలో మొబైల్ద్వారా ఫింగర్ప్రింట్స్సేకరించడంతో పాటు రాష్ట్ర సర్వర్‌కు పంపిస్తారు. వీటిని క్రిమినల్ రికార్డులతో ఆటోమేటిక్‌గా సెర్చ్‌చేసి అనుమానితులను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులకు సహాయపడుతుంది.
దీంతో పాటు ‘మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్’ ద్వారా ఫేస్ రికగ్నేషన్చేయనున్నారు. 9.8 లక్షలకు పైగా ఫొటోలతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా సుమారు 15 సెకన్లలోనే అనుమానితులు, నేరగాళ్ల ఫేస్ రికగ్నేషన్చేసే అవకాశం ఉంటుంది. దీంతో అనుమానితులను గుర్తించడం, గుర్తుతెలియని మృతదేహాల వివరాలను నిర్ధారించడం, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనడం వంటి సందర్భాల్లో ఈ యాప్మంచి ఫలితాలు ఇస్తుంది.
జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా కోసం జేఆర్ఎంఎస్
నేరాల నియంత్రణ, ముందస్తు పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ (జేఆర్ఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ)కు చెందిన ఈ–-ప్రిజన్స్ వ్యవస్థను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)తో అనుసంధానించారు. దీంతో జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల వివరాలు సంబంధిత పోలీస్స్టేషన్లు, అధికారులకు ఎస్‌ఎంఎస్‌ద్వారా చేరనున్నాయి.
ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన ఖైదీలపై స్థానిక పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. మరోవైపు సీఐడీ కార్యకలాపాల కోసం https://cid.tspolice.gov.in/ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సీఐడీ విభాగం విధులు, కార్యకలాపాలు, ప్రజలకు అందించే సేవలపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డులు, 23 రకాల నివేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాంకేతికతతో మరింత సమర్థంగా పోలీసింగ్: డీజీపీ
నేరాల దర్యాప్తులో ఒకే విధమైన ప్రమాణాలను పాటించేందుకు ఐదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. భౌతిక, శారీరక నేరాలు, ఆస్తి నేరాలు, మహిళలు -పిల్లలపై నేరాలు, ప్రత్యేక -స్థానిక చట్టాల కింద నమోదయ్యే కేసులు, ఇతర నేరాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో పొందుపరిచామన్నారు.
దర్యాప్తు అధికారులు కేసుల స్వభావానికి అనుగుణంగా సరైన విధానాలను అనుసరించేందుకు ఈ మార్గదర్శకాలు తోడ్పడనున్నాయి. ఆధారాల సేకరణ, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా న్యాయస్థానాల్లో నేర నిరూపణ అవకాశాలను పెంచడమే వీటి ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఏడీజీ అకున్ సబర్వాల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
