లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన గోరఖ్‌పూర్-ఫైజాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ధ్రువ్ కుమార్ త్రిపాఠి స్వతంత్ర అభ్యర్థి రాజీవ్ యాదవ్‌పై 300 ఓట్లకు పైగా స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. గోరఖ్‌పూర్-ఫైజాబాద్ ఎన్నికల కౌంటింగ్ దాదాపు 35 గంటలకు పైగా హోరాహోరీగా.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతగడ్డ గోరఖ్ పూర్లో తొలుత బీజేపీ అభ్యర్థి వెనకబడ్డాడు. మొదటి మూడు రౌండ్లు స్వతంత్ర అభ్యర్థి రాజీవ్ యాదవ్ ఆధిక్యం కనబర్చారు. దీంతో సీఎం సొంత గడ్డలో బీజేపీకి భంగపాటు తప్పదనుకున్నారు. అయితే, నాలుగో రౌండ్లో సీన్ ఒక్కసారిగా ఛేంజ్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి అకస్మాత్తుగా అధిక్యంలో వచ్చారు. చివరి వరకు ఇదే లీడింగ్ కంటిన్యూ చేస్తూ చివరకు బీజేపీ అభ్యర్థి ధ్రువ్ కుమార్ త్రిపాఠి 300 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందాడు.
ఈ ఫలితంపై స్వతంత్ర అభ్యర్థి రాజీవ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ క్యాండిండేట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటింగ్ బహిష్కరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భారీ అవకతవకలు, పరిపాలనాపరమైన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికార యంత్రాంగం వ్యవహరించిందని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని.. రౌండ్ల వారీ ఓట్ల వివరాల చార్టులను రిటర్నింగ్ అధికారి ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపణలు చేశారు.
గోరఖ్‌పూర్ ఎమ్మెల్సీ ఫలితంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటమి భయంతో ఓట్ల లెక్కింపులో బీజేపీ అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. గోరఖ్‌పూర్‌లో పరిపాలన యంత్రాంగం జోక్యంతో కుట్ర పూరితంగా బీజేపీని గెలిపించారని ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో నైతికంగా బీజేపీ ఓడిపోయిందని పేర్కొన్నారు.
కాగా, యూపీలో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార బీజేపీ 6 స్థానాలు దక్కించుకోగా.. ప్రతిపక్ష ఎస్పీ 5 సీట్లలో విజయం సాధించింది. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ఓటమి పాలుకావడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
