50 లక్షలు పెట్టి ఫ్లాట్ బుక్ చేసుకుంటే.. పదేళ్లయినా హ్యాండోవర్ చేయని బిల్డర్... కోర్టుకెళ్తే జరిగింది ఇది..!

50 లక్షలు పెట్టి ఫ్లాట్ బుక్ చేసుకుంటే.. పదేళ్లయినా హ్యాండోవర్ చేయని బిల్డర్... కోర్టుకెళ్తే జరిగింది ఇది..!

ముంబైలో ఓ వ్యక్తి 2015లో  రూ. 50 లక్షలు పెట్టి ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. పదేళ్లు గడుస్తున్నప్పటికీ డెవలపర్ తనకు ఫ్లాట్ హ్యాండోవర్ చేయకపోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. ఈ కేసు విచారణ జరిపిన కోర్టు బాధితుడికి 9 శాతం వడ్డీతో రూ. 86 లక్షలు చెల్లించాలని డెవలపర్ ను ఆదేశించింది. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ములుండ్ నివాసి తపన్ విసారియా రాయగడ్ జిల్లా, పన్వెల్ తాలూకా, ఆష్తే గ్రామంలోని ప్రాజెక్టులో, డి-వింగ్‌లోని మూడవ అంతస్తులో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. 876 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా గల ఫ్లాట్‌ను విసారియా మొత్తం రూ. 50.52 లక్షలకు బుక్ చేసుకున్నారు. సేల్ డీడ్ ఆగస్టు 7, 2015న చేసుకోగా... డెవలపర్ డిసెంబర్ 31, 2016 లోపు ఫ్లాట్‌ను అప్పగిస్తామని వాగ్దానం చేశారు, కానీ గడువును పదేపదే పొడిగిస్తూ... ఆ తర్వాత మహారెరా వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 30, 2026 వరకు గడువు పొడిగించినట్లు ప్రకటించారు.

►ALSO READ | ఓటు ఉన్నళ్లోకు మళ్లీ ఫామ్ 6 ఏంటీ.. అసలు బుర్ర వాడారా..? ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్

ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు బాధితుడికి రూ. 86.37 లక్షలు (వడ్డీతో సహా) సంయుక్తంగా మరియు విడివిడిగా వాపసు చేయాలని మెస్సర్స్ సౌండ్‌లైన్స్ ఎకో హోమ్స్ అండ్ పార్ట్నర్స్ ను ఆదేశించింది. 

బాధితుడు చెల్లించిన రూ. 45 లక్షల మొత్తంతో పాటు, ఒప్పందం ప్రకారం హ్యాండోవర్ చేయాల్సిన తేదీ అయిన డిసెంబర్ 31, 2016 నుండి తీర్పు వెల్లడించిన తేదీ వరకు తొమ్మిది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని తెలిపింది కోర్టు . దీంతో పాటు కోర్టు ఖర్చులు రూ.75 వేలు కూడా చెల్లించాలని తెలిపింది కోర్టు.