కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత ఇంద్రనీల్ సేన్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.60 కోట్ల మనీలాండరింగ్ కేసులో సాల్ట్ లేక్‌లోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం బయట బుధవారం (అక్టోబర్ 28) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, టీఎంసీ ప్రభుత్వ హయాంలో యునెస్కో పేరుతో కోల్‌కతాలో జరిగిన దుర్గాపూజ ప్రివ్యూ షోల విక్రయాలు, వీఐపీ పాస్‌ల జారీలో మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్ ఆయన భార్య మధుచంద సేన్ సుమారు రూ.50 నుంచి 60 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోల్‌కతాలోని బౌబజార్ పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ ఈ అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగానే బుధవారం (అక్టోబర్ 28) ఇంద్రనీల్‌ను ఈడీ విచారణకు పిలిచింది. విచారణకు హాజరై వెళ్తుండగా ఈడీ కార్యాలయం బయట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కలకత్తా హైకోర్టులో ఇంద్రనీల్ సేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
►ALSO READ | రాహుల్ వర్సెస్ నిర్మలా.. టాటా గ్రూప్ వివాదంపై మాటల యుద్ధం
