WPL 2027 Auction: కొచ్చి వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2027 Mini Auction) మినీ వేలం పాట తీవ్ర ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఐదు ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న పరిమిత పర్స్ తో వ్యూహాత్మకంగా బిడ్డింగ్ వేస్తున్నాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) భారీ ధర పలుకగా.. కిరణ్ నవగిరే, జె.కమలిని లాంటి భారత క్రీడాకారిణులు మంచి ధరలు సొంతం చేసుకున్నారు. అయితే, అనేక మంది అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వేలంలో లక్షలు కొల్లగొట్టిన స్టార్స్:
మొదటి రెండు రౌండ్లలో అమ్ముడైన ప్రధాన ఆటగాళ్లు వీళ్లే:
* సోఫీ మోలినెక్స్ (Sophie Molineux): UP వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది.
* కిరణ్ నవగిరే (Kiran Navgire): ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.
* జి. కమలినీ (G Kamalini): గుజరాత్ జెయింట్స్ (GG) రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (Orla Prendergast): గుజరాత్ జెయింట్స్ (GG) రూ. 30 లక్షలకు దక్కించుకుంది.
* స్నేహ్ రాణా (Sneh Rana): UP వారియర్స్ (UPW) రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
* గ్రేస్ హారిస్ (Grace Harris): UP వారియర్స్ (UPW) రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.
రెండో రౌండ్‌లో ఇద్దరికి లక్కీ ఛాన్స్ :
* సుష్మా వర్మ (Sushma Verma): UP వారియర్స్ - రూ. 30 లక్షలు
* దిశా కసత్ (Disha Kasat): ముంబై ఇండియన్స్ (MI) - రూ. 10 లక్షలు
ఫ్రాంచైజీల మైండ్ గేమ్‌లు.. అన్ సోల్డ్ ప్లేయర్లకు షాక్:
* ఈ వేలంలో పలువురు సీనియర్ అంతర్జాతీయ, భారత క్యాప్డ్ ఆటగాళ్లకు ఏ జట్టు నుంచి బిడ్‌లు రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఫ్రాంచైజీలు తమ నిర్దిష్ట లక్ష్యాల కోసమే చూస్తూ మిగతా వారికి హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
* స్టార్ బ్యాటర్లు, వికెట్ కీపర్లు: ఇంగ్లాండ్ స్టార్ సోఫియా డంక్లీ, భారత కీపర్లు ఉమా ఛెట్రీ, తానియా భాటియా, తేజల్ హసబ్నిస్, ఆయుషి సోనిలు అమ్ముడుపోలేదు.
ఫాస్ట్ బౌలర్లు: సైమా ఠాకూర్, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ టేలా వ్లామింక్, మిథాలీ అయోధ్య, రోజ్‌మేరీ మైర్ మరియు టిటాస్ సాధులకు ఏ ఫ్రాంచైజీ బిడ్ వేయలేదు.
స్పిన్నర్లు: భారత్ స్టార్ స్పిన్నర్లు సైకా ఇషాక్, ఆశా శోభన, ప్రియా మిశ్రా మరియు దక్షిణాఫ్రికా స్పిన్నర్ నాన్‌కులేకో మ్లాబాలు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు, కీపర్లు: చార్లీ నాట్, ప్రగతి సింగ్, టెస్ ఫ్లింటాఫ్, పూనమ్ ఖేమ్నర్, సుజాత దేయ్, సారా బ్రైస్, శివానీ సింగ్‌లను ఏ జట్టూ తీసుకోలేదు.
#UPW fans, how excited are you for this signing? 💪 🎥 The moment @UPWarriorz onboarded Australian Captain Sophie Molineux for INR 1.1 Crore 🔨 #TATAWPL | #TATAWPLAuction https://t.co/3Oh9fZlOCl
— Women's Premier League (WPL) (@wplt20) October 28, 2026
