తుఫాన్ దెబ్బకు సముద్రంలోని భారీ నౌక.. ఒడ్డుకు కొట్టుకొచ్చింది..!

తుఫాన్ దెబ్బకు సముద్రంలోని భారీ నౌక.. ఒడ్డుకు కొట్టుకొచ్చింది..!

ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ( అక్టోబర్ 28 ) తెల్లవారుజామున తుఫాను తీరం దాటిన క్రమంలో తీర ప్రాంతంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు విరిగిపడి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అంతర్వేది సమీపంలో సల్ఫర్ తీసుకెళ్తున్న భారీ నౌక దారి తప్పి సముద్రంలో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ నౌక అంతర్వేది సమీపంలో ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు తెలిపారు పోర్ట్ అధికారులు.

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రంలో ఉధృతమైన అలలు ఎగిసిపడటంతో ఇంజిన్‌ సమస్యతో నౌక దారి తప్పిందని అంటున్నారు అధికారులు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం నౌక పరిస్థితిని పోర్టు, సముద్ర భద్రతా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నౌకలోని సిబ్బంది పరిస్థితి, సరుకుకు జరిగిన నష్టం వంటి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

►ALOS READ | జనం ఊపిరి పీల్చుకునే వార్త: తీరం దాటిన అర్నాబ్‌ తుఫాన్‌.. క్రమంగా బలహీనం..!

ఇదిలా ఉండగా, యానాంకు నైరుతి దిశలో బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాల్లో బుధవారం ఉదయం 8 గంటలకల్లా అతి తీవ్రమైన అర్నాబ్ తుఫాను తీరాన్ని తాకిందని, గరిష్టంగా గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు, గంటకు 150 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.