పాఠశాలల్లోనే క్లీన్ స్పోర్ట్స్ వాల్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.. యునెస్కోతో బిగ్ డీల్!

పాఠశాలల్లోనే క్లీన్ స్పోర్ట్స్ వాల్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.. యునెస్కోతో బిగ్ డీల్!
Clean Sport Values: భారత దేశంలోని ప్రతీ తరగతి గదిలోనూ స్వచ్ఛమైన క్రీడా విలువల (Clean Sport Values) గురించి అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 'స్పోర్ట్స్ వ్యాల్యూస్ ఇన్ ఎవెరీ క్లాస్‌రూమ్ టూల్‌కిట్' (Sports Values in Every Classroom Toolkit) ద్వార పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడా విలువలను నేర్పించేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలు యునెస్కో (UNESCO) తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన 'క్లీన్ స్పోర్ట్ కాన్క్లేవ్' వేదికగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya), కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

13 భారతీయ భాషల్లో మాడ్యూల్స్:

* 13 భాషల్లో లభ్యం: ఈ ప్రత్యేక టూల్‌కిట్ వీడియో మాడ్యూల్స్ దేశవ్యాప్తంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 13 భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. 

* ముఖ్య లక్ష్యం: క్రీడలు, విద్య, నిత్య జీవితంలో విద్యార్థుల్లో గౌరవం (Respect), సమగ్రత (Integrity), నిష్పాక్షికత (Fairness) లాంటి సద్గుణాలను పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడం.

* ప్రముఖులు: ఈ కార్యక్రమంలో యునెస్కో దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ టిమ్ కర్టిస్, పాఠశాల విద్యా కార్యదర్శి టి.కె. అనిల్ కుమార్, స్పోర్ట్స్ కార్యదర్శి హరిరంజన్ రావు, నాడా డెరెక్టర్ జనరల్ అనంత్ కుమార్లతో పాటు భారత స్టార్ జావెలెన్ త్రోయర్ సచిన్ యాదవ్ (Sachin Yadav) పాల్గొన్నారు.

డోపింగ్ నిరోధానికి కఠిన చర్యలు: 

* క్రీడల్లో నైతికత, నిష్పాక్షికత అత్యంత కీలకమని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. 

* నాడా పనితీరు: 2025–26 సంవత్సరంలో నాడా (NADA) ఏకంగా 7,000 పైగా డోపింగ్ పరీక్షలు నిర్వహించిందని, 350+ కంటే ఎక్కువ అవగాహన సదస్సుల ద్వారా 27,000 మందికి క్రీడా విలువలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

* క్రిమినలైజేషన్ దిశగా: డోపింగ్ నిరోధక నాడా చట్టం అమలులోకి వచ్చిందని, త్వరలోనే డోపింగ్ సంబంధిత చట్టవిరుద్ధ కార్యకలాపాలను క్రిమినల్ నేరంగా పరిగణించే నిబంధనలను పార్లమెంట్‌లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.

* గాంధీనగర్, హైదరాబాద్‌లలో టెస్టింగ్: అనుకోకుండా జరిగే డోపింగ్‌ను అడ్డుకోవడానికి గుజరాత్‌లోని గాంధీనగర్ NFSU, హైదరాబాద్‌లోని NIPER కేంద్రాల్లో సప్లిమెంట్ టెస్టింగ్ సదుపాయాలను మెరుగుపరిచినట్లు చెప్పారు.

విద్య, క్రీడల అనుసంధానం: ప్రహ్లాద్ జోషి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులు క్రీడల్లో పాల్గొనకపోవడం, క్రీడల్లో ఉన్నవారు చదువుకు దూరమవ్వడం లాంటివి చాలా కాలంగా ఉన్న అంతరాన్ని ఈ ఎంవోయూ తొలగిస్తుంది. 'ఖేలో భారత్ నీతి 2025' సూచించినట్లుగా పాఠశాల స్థాయి నుంచే స్పోర్ట్స్ వ్యాల్యూస్‌ను విద్యార్థుల జీవితంలో భాగం చేయడంతో క్రమశిక్షణ కలిగిన పౌరులు తయారవుతారని స్పష్టం చేశారు.

►ALSO READ | Spain Train Tragedy: రైలు ప్రమాదంపై ఫుట్ బాల్ ఆటగాళ్లు షాక్..