బ్యాలెట్ ఓటింగ్ కదా.. ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిచారు : కాంగ్రెస్ పై మోదీ సెటైర్లు

బ్యాలెట్ ఓటింగ్ కదా.. ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిచారు : కాంగ్రెస్ పై మోదీ సెటైర్లు

వోట్ బచావో దేశ్ బచావో పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి సిద్దమైన క్రమంలో ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడంపై ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. బ్యాలట్ పేపర్ తోనే ఎన్నికలు జరిగాయి కదా.. కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచిందో గెస్ చేయండంటూ ట్వీట్ చేశారు మోడీ.

యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేయగా గతంలో ఆ పార్టీ గెలిచిన 4 స్థానాలు కూడా కోల్పోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.

 

ఈ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. ఈవీఎంలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బ్యాలట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో బ్యాలట్ పేపర్ తో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పట్ల ఎద్దేవా చేశారు మోడీ. 

►ALSO READ | జ్ఞాను వెళ్లాల్సిందే.. ఇండియా బ్లాక్ ర్యాలీకి CJP మద్దతు