ఉక్రెయిన్ రైల్వేస్టేషన్ పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి..

ఉక్రెయిన్ రైల్వేస్టేషన్ పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి..

ఉక్రెయిన్ లోని డ్నిప్రో సిటీ రైల్వేస్టేషన్ పై భీకర దాడికి పాల్పడింది రష్యా. రైల్వేస్టేషన్ లో రైలు ఆగి ఉండగా డ్రోన్ దాడి జరగడంతో 13 మంది మరణించారు. ఈ దాడిలో మరో 13 మందికి గాయాలయ్యాయి. గురువారం ( అక్టోబర్ 29 ) ఈ దాడి జరిగిన సమయంలో రైల్వే స్టేషన్ లో పలు రైలు నిలిపి ఉన్నాయని తెలిపారు ఉక్రెయిన్ అధికారులు. జెట్ ఇంజిన్ తో నడిచే డ్రోన్ సాయంతో రష్యా ఈ దాడికి పాల్పడ్డట్లు తెలిపింది ఉక్రెయిన్ రైల్వే సంస్థ.

దాడి జరిగిన సమయంలో డ్నిప్రో నుంచి జపార్జియా నగరానికి వెళ్లాల్సిన 866  రైలు ప్లాట్ ఫారంపై ఉందని.. అదే ప్లాట్ ఫామ్ లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారని తెలిపింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దాడి జరిగే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్టేషన్ లో ప్రయాణికులు ఉన్నారని తెలిపింది రైల్వే సంస్థ. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని తెలిపింది.

ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా, యూరప్, సహా జీ7 దేశాలను కోరారు జెలెన్ స్కీ.డ్నిప్రో రైల్వేస్టేషన్ పై రష్యా భీకర దాడి చేసిందని.. రైళ్లు ప్లాట్ ఫారంపై నిలిచి ఉన్న సమయంలో డ్రోన్ దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 13 మంది మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ దాడిలో గాయపడ్డ 10 మందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.