ఇప్పుడంతా లివిన్ రిలేషన్ షిప్స్, DINK ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి మీద నేటి యువతకు ఒపీనియన్ మారుతోంది. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మెజారిటీ యువత అయితే సహజీవనం చేస్తున్నారు. పెళ్ళైనా కూడా పిల్లలు వద్దనుకుని ఎవరి జీతం వారిది, ఎవరి జీవిత,ఎం వారిది అన్నట్లు జీవించేవారు కూడా పెరిగిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు చేస్తున్నారంటే నమ్ముతారా..? అవును నిజం అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో ఇంకా బాల్య వివాహాలు చేస్తున్నారు.బాల్య వివాహాల కేసులో పోలీసులు 80 మందిని అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
అస్సాంలోని ధుబ్రి జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించిన 66 కేసుల్లో 54 మంది భర్తలతో సహా కనీసం 80 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరోకొంతమంది కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద ఈ అరెస్టులు చేశామని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని.. అందరి మీద కఠిన చర్యలు చేపడతామని తెలిపారు పోలీసులు.
