ముంబై నగరంలో ఇష్టం వచ్చినట్లు చెత్తాచెదారం పారేసే సమస్యను అరికట్టేందుకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పబ్లిక్ స్థలాలలో AI ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ కెమెరాలు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తుంటే వెంటనే గుర్తించి.. లౌడ్‌స్పీకర్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తాయి.
ఈ వినూత్న కార్యక్రమాన్ని తొలి విడతగా మాహిమ్‌లోని గజానన్ వాటిక వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇక్కడ ఎవరైనా చెత్త వేయడానికి ప్రయత్నిస్తే.. కెమెరాలోని ట్రాకింగ్ సిస్టమ్ వారి కదలికలను రియల్ టైమ్‌లో పసిగడుతుంది. వెంటనే మైక్ ద్వారా చెత్తను రోడ్లపై పారేయవద్దని, పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తుంది.
🔷मुंबईतील मोठ्या प्रमाणात कचरा साचण्याच्या संभाव्य ठिकाणांवर (Garbage Vulnerable Points- GVP’s) कचरा टाकण्यास प्रतिबंध करण्यासाठी बृहन्मुंबई महानगरपालिकेच्या ‘जी/उत्तर’ विभागाने तंत्रज्ञानाधारित अभिनव उपक्रम सुरू केला आहे. 🔷माहीम येथील डॉ. रायकर मार्गावरील गजानन वाटीका येथे कृत्रिम बुद्धिमत्तेवर (AI) आधारित कॅमेरा लावण्यात आला आहे. 🔷कृत्रिम बुद्धिमत्तेवर आधारित कॅमेरा कचरा टाकण्यासाठी येणाऱ्या व्यक्तीची हालचाल ओळखतो आणि तत्काळ ध्वनिक्षेपकाद्वारे परिसर स्वच्छ ठेवण्याचे व उघड्यावर कचरा न टाकण्याचे आवाहन करतो. 🔷महानगरपालिकेकडून येत्या काही दिवसात मुंबईत विविध ठिकाणी कृत्रिम बुद्धिमत्ता आधारित कॅमेरे लावण्यात येणार आहेत. #mybmcupdates @CMOMaharashtra @mieknathshinde @SunetraA_Pawar @ShelarAshish @MPLodha @TawdeRitu @misanjayghadi @mybmcSWM
— माझी Mumbai, आपली BMC (@mybmc) October 29, 2026
ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ముంబై వ్యాప్తంగా ఇలాంటి ఏఐ కెమెరాల ఏర్పాటును పెంచాలని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. పౌరుల్లో మార్పు తెచ్చి, నగరంలోని వీధులను శుభ్రంగా ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు ఉంటాయా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు.
ఈ చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమ స్పందన తెలిపారు. సాంకేతిక వాడకం అభినందనీయమని కొందరు అంటుండగా.. కేవలం హెచ్చరికలతోనే సమస్య తీరదని, కఠిన చర్యలు కూడా ఉండాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ముంబైలో ఈ ఏఐ కెమెరాల ప్రయోగం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఇలా చెత్తాచెదారం రోడ్లమీద వేసేవాళ్లను అరికట్టేందుకు ఈ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
