హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నిమ్స్ డాక్టర్ లక్ష్మి భాస్కర్ వ్యవహారంలో గురువారం ( అక్టోబర్ 29 ) ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. క్యాంటీన్ తో పాటుకు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో గతంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి సోదాలు చేపట్టారు. డాక్టర్ లక్ష్మి భాస్కర్ మెడికల్ స్టోర్స్ క్యాంటీన్ లో నుంచి రూ. 50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిమ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు నలుగురు అధికారులు. సర్జికల్ స్టోర్లో మందులు, పరికరాల నిల్వలను తనిఖీ చేస్తున్నారు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం.
ALSO READ : నిజం నిలకడ మీదే తేలుతది
ఏకకాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులకు మెడికల్ స్టోర్స్, సర్జికల్ స్టోర్స్, క్యాంటీన్ల నుంచి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
