ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారా? పిల్లలతో టైం గడపలేకపోతున్నారా ? ఈ కొత్త కాన్సెప్ట్ ట్రై చేయండి!

ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారా?  పిల్లలతో టైం గడపలేకపోతున్నారా ? ఈ కొత్త   కాన్సెప్ట్  ట్రై చేయండి!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న చాలామందికి వర్కింగ్ అవర్స్ పెరిగాయి. మునుపటి కంటే టార్గెట్లు ఎక్కువయ్యాయి. దాంతో పేరుకు ఇంట్లో ఉంటున్నారే తప్ప, పిల్లలతో గడపడానికి టైం ఉండట్లేదు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ వర్క్ ఫ్రేమ్ హోమ్ లో ఉంటే, ఆ ఇల్లు ఒక ఆఫీస్ అయిపోతోంది. అమ్మానాన్నలు కంప్యూటర్ల ముందు కూర్చుంటే... పిల్లలు మరో రూమ్లో ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ నుంచి బయటికొచ్చి పిల్లలతో గడిపేందుకు వచ్చిన కాన్సెప్ట్ 'డూ నతింగ్'. అంటే ఏ పనీ చేయకుండా ఉండటం.

ఆఖరిసారిగా మీరు ఏ పనీ చేయకుండా ఉన్నదెప్పుడు ? ఎప్పుడైనా ఖాళీగా ఉండి.. టైం వేస్ట్ కాలేదని అనుకున్నారా ? ఎలాంటి ప్లాన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు కొత్తగా ఉంటాయి. 'పిల్లలతో రోడ్ ట్రిప్స్ కి వెళ్తున్నాం', 'పార్క్స్ లో  గేమ్స్ ఆడుతున్నాం', 'ఆన్లైన్ క్లాసులప్పుడు హెల్ప్ చేస్తున్నాం.. ఇవన్నీ పిల్లల కోసమే కదా అంటారా? అయితే ఇవేవీ 'డూ నతింగ్' కిందకు రావు. మరి ఏం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం......

పది నిమిషాలు చాలు
ఆఫీస్ పని, ఇంట్లో పనులు రోజూ ఉండేవే. అయితే వాటికోసం ఇరవై నాలుగ్గంటలు కేటాయించనక్కర్లేదు. అలాగని "డూ నతింగ్" కోసం గంటల సమయం అవసరం లేదు. రోజు మొత్తంలో నాలుగు గంటలకోసారైనా ఐదు, పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆ పది నిమిషాలు ప్రపంచానికి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి ఫ్యామిలీతోనే ఉండాలి. కావాలంటే రోజులో ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉండాలో ఒక షెడ్యూల్ వేసుకోవచ్చు. మొదట్లో ఆ టైం పీరియడ్ లో ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ, వారాలు గడుస్తున్న కొద్దీ డూ నతింగ్ కాన్సెప్ట్ ని  ఎవరికి వాళ్లు కొత్తగా ట్రై చేస్తారు. ఆఫీస్ ఫోన్ కాల్స్ మధ్యలో పావుగంట గ్యాప్ వచ్చినా, బాస్ తో అపాయింట్మెంట్ కాన్సిల్ అయినా.. ఆ టైం డూ నతింగ్ కి ఉపయోగించుకోవచ్చు. అంతేతప్ప ఆ గ్యాప్లో ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో స్కోలింగ్ చేయడం కాకుండా పిల్లలతో రిలాక్స్ అవ్వాలి.

ఆన్ ప్లగ్ గ్యాడ్జెట్స్
ఫిజికల్ గా.. మెంటల్ గా ఎప్పుడైనా డల్ అయినప్పుడు చాలామంది చేసేపని ఫోన్ పట్టుకోవడం లేదా టీవీ ఆన్ చేయడం.
అయితే ఈ రెండూ టైం, ఎనర్జీని వాడుకుంటాయే తప్ప బూస్ట్ చేయలేవు. డూ నతింగ్ కాన్సెప్ట్ మైండ్ అసలు ఎంగేజ్ లో ఉండకూడదు. ఫోన్ పట్టుకున్నారంటే.. బ్రేయిన్ దాన్ని చూసే పనిలో ఉందని, అదే బ్రెయిన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఎనర్జీని ఖర్చు చేస్తోందని అర్థం చేసుకోవాలంటాడు ఇంగ్లీష్ రైటర్ సిలెస్ట్ హెడ్లీ. అందువల్ల డూ నతింగ్ టైంని ఫోన్, టీవీకి కాకుండా ఫ్యామిలీకి ఇవ్వాలి. ఖాళీ టైం దొరికినప్పుడు ఫోన్ ని ఫైట్ మోడ్లో పెట్టుకోవాలి. లాప్ టాప్ వంటి గ్యాడ్జెట్స్ ఆఫ్ చేయాలి. ఆ టైంలో పిల్లల్ని వీధుల్లో తిప్పుతూ ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తున్న మేఘాలను చూస్తుండొచ్చు. కావాలంటే అలారం సెట్ చేసుకుని, మళ్లీ వర్క్ లో జాయిన్ అవ్వచ్చు.

ALSO READ : ప్రతిసారి ఫేషియల్ చేయిస్తున్నారా..? మీ చర్మానికి ఎంత డేంజరో తెలుసా?

స్టార్ట్ స్మాల్
డూ నతింగ్ అనేది అనుకున్నంత సులువు కాదు. ఎలాంటి ప్లాన్స్, షెడ్యూల్స్, ఎజెండా లేకుండా మైండ్ ని క్లియర్ గా ఉంచుకోవడమే ఈ కాన్సెప్ట్. పిల్లలైనా, పెద్దలైనా ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టిన కొత్తలో ఎక్కువ సమయం ఖాళీగా ఉండటం కష్టం. అందువల్ల చిన్నచిన్న ఇంటర్వెల్స్ లో డూ నతింగ్ సెట్ చేసుకోవాలి. ఆఫీస్ వర్క్ లో ఉన్నప్పుడు మధ్యమధ్యలో ఐదు నిమిషాలు పిల్లలు, ఫ్యామిలీతో గడపొచ్చు. అలాగని వాళ్లతో బలవంతంగా బుక్ రీడింగ్, డ్రాయింగ్ చేయించడం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్లతో గడపడం ముఖ్యం.

గిల్టీ  ఫిలింగ్ వద్దు
ఇంతసేపు ఏమీ చేయకుండా టైం వేస్ట్ చేశామనే గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. అందువల్ల ఎప్పటికప్పుడు మనసుకు గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. 'మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి కావాలనే ఏం చేయొద్దనే కాన్సెప్ట్ ని ఎంచుకున్నాం' అని. కాబట్టి 'టైం వేస్ట్ అయింది... బద్ధకంగా ఉన్నామా' అనే అనుమానాలు పెట్టుకోవద్దు. ఫ్యామిలీ లైఫ్ తో పాటు ఆఫీస్ వర్క్స్ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇలాంటి చిన్నచిన్న బ్రేక్స్ చాలా అవసరం.

రూల్స్ పెట్టొద్దు 
ఎజెండా లేకుండా ఫ్యామిలీతో కూర్చుని టైం గడపడం ఎలా? అనే సందేహం అందరికీ వస్తుంది. తెలియకుండా ఒక గేమ్ లేదా యాక్టివిటీ ప్లాన్ ని బ్రెయిన్ సూచిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని అప్పటి ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఒక్కోసారి పిల్లలకు బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మాటలతో ఎంగేజ్ చేయొచ్చు. పిల్లలకు ఆడుకోవాలని ఉంటే ఆడనివ్వాలి. కానీ ఆటలో పేరెంట్స్ ఏ రూల్స్ పెట్టొద్దు. ఇలా చేస్తున్న కొద్దీ పిల్లలతో పాటు పెద్దలూ క్రియేటివ్ టైంని స్పెండ్ చేస్తారు.

చుట్టు పక్కల తిరిగితే చాలు
డూ నతింగ్ కోసం పార్కులు, దూర ప్రదేశాలకు వెళ్లడం కరెక్ట్ కాదు. చుట్టుపక్కల పరిసరాల్లోనే టైం స్పెండ్ చేయాలి. ఫిట్ నెస్ గోల్స్ ని పక్కనబెట్టి, పిల్లలతో ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లు వాకింగ్ చేయొచ్చు. పువ్వులు, ఆకులు, మట్టిని చూపించి పిల్లలకు వాటి కలర్స్ ఏంటో చెప్పొచ్చు. చల్లటి గాలులను ఎంజాయ్ చేయొచ్చు. నడుస్తున్న అడుగుల చప్పుళ్లను అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ డూ నతింగ్ టైంలో చేస్తే, పిల్లలు పేరెంట్స్ తో పాటు నేచరికి కూడా కనెక్ట్ అవుతారు. అయితే ఉదాహరణకు చెప్పిన పనులను పనికట్టుకుని చేయొద్దు సుమీ.