ఫేషియల్ వల్ల చర్మం మెరుస్తుంది. అయితే.. రెగ్యులర్ గా ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అందువల్ల ఫేషియల్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం.
ఫేషియల్స్ లో ఉపయోగించే సొల్యూషన్స్, క్రీమ్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి చర్మ కణాలను డ్యామేజ్ చేస్తాయి. వాటివల్ల చర్మంపై దురద వస్తుంది. మచ్చలు కూడా ఏర్పడతాయి. ఫేషియల్స్ చేసేటప్పుడు స్క్రబ్ చేయడం వల్ల చర్మంలో ఉండే మాయిశ్చరైజర్ పోయి చర్మం పై పొర డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫేషియల్స్ చేసేటప్పుడు ఉపయోగించే కెమికల్స్ పడకపోతే చర్మం ఎర్రగా మారుతుంది. అంతేకాదు, కొన్నిసార్లు చర్మం వాపొస్తుంది కూడా. ఫేషియల్ తర్వాత చాలామందికి పింపుల్స్ సమస్య పెరుగుతుంది.
ఎందుకంటే ఫేషియల్స్ తర్వాత చర్మంపై రంధ్రాలు తెరుచుకోవడం వల్ల సెబమ్ ఉత్పత్తి అయి.. మొటిమలు వస్తాయి. అలాగే బ్లాక్ హెడ్స్ తొలగించేటప్పుడు బ్యూటీషియన్స్ చేతి వేళ్లు లేదా పరికరాలు ఉపయోగిస్తారు. ఇలా చేసేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గాయాలు, గీతలు ఏర్పడతాయ్. అందువల్ల ఫేషియల్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరంటే వాళ్ల దగ్గర కాకుండా ఎక్స్ పర్ట్స్ దగ్గర మాత్రమే ఫేషియల్స్ చేయించుకోవాలి. ఇంట్లో అందుబాటులో ఉండే ఫ్రూట్స్ తో ఫేస్ ప్యాక్స్ వేసుకున్న ఫెషియల్ గ్లో వస్తుంది. అదెలాగంటే..
బోప్పాయితో
ఒక కప్పు బొప్పాయి ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగి మెత్తని టవల్ తో తుడుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఫేషియల్ గ్లో వస్తుంది.
అరటితో
అరటిపండుని గుజ్జులా చేసి ఒక టీ స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎలాంటి చర్మానికి అయినా మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ -బి6, C, Aలు చర్మాన్ని రిఫ్రెష్ చేస్తాయి.
