SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక. డిసెంబర్ 1, 2026 నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్, ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఈ కొత్త నిబంధనలతో పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లు చేసే కస్టమర్లపై ప్రభావం పడనుంది.

కొత్త రూల్స్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి రూ.30వేలు దాటిన ప్రతి ట్రాన్స్‌పోర్ట్ లావాదేవీపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు మీరు రూ.35వేలు ఇంధనం కోసం ఖర్చు చేస్తే దానికి 1 శాతం చొప్పున రూ.350 అదనపు ఛార్జ్ పడుతుంది. అయితే రూ.30వేల లోపు లావాదేవీలకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు.

ఇక పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోలు చేసే వారికి కూడా మరో నిబంధన వర్తిస్తుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం ఇంధన ఖర్చుల విలువ రూ.50వేలు దాటితే.. మొత్తం ఫ్యూయెల్ స్పెంట్స్‌పై 1 శాతం రుసుము పడుతుంది. ఒకవేళ మీ బిల్లింగ్ సైకిల్‌లో పెట్రోల్ డీజిల్ ఖర్చు రూ.55వేలు అయితే.. కేవలం అదనపు రూ.5వేల పైనే కాకుండా మొత్తం రూ. 55వేలపై 1 శాతం అంటే రూ.550 ఛార్జ్ పడుతుంది.

ALSO READ  : దీపావళి కానుకలపై ట్యాక్స్ పడుతుందా?

పెద్ద మొత్తంలో రవాణా, ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్ చేసే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ కొత్త ఛార్జీల గురించి ముందే తెలుసుకోవడం మంచిది. లేదంటే బిల్లు చెల్లించేటప్పుడు జేబుకు చిల్లు పడటం ఖాయం. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను ప్లాన్ చేసుకోండి.