హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ నుంచి భర్తరఫ్ అయిన నాటి నుంచి పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటున్న ఆమె రెండేళ్ల క్రితం నాటి వివాదంలో ఇప్పుడు కేటీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. ఆమె మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఈ క్రమంలో కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గురువారం (అక్టోబర్ 29) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మా సోదరిమని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవి కోల్పోయిందన్నారు.
అనిరుధ్ అంశం సీరియస్‌గా తీసుకున్నం:
నిధులు ఇస్తారా.. చచ్చిపోమంటారా అంటూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంశంపైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అనిరుధ్ రెడ్డి అంశం సీరియస్‌గా తీసుకున్నామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని చూసుకుంటుందన్నారు. ఒక్క జడ్చర్లలోనే నిధుల కొరత ఉందని చెప్పడం సరికాదని.. రాష్ట్రంలోని చాలా చోట్లా నిధుల కొరత ఉందని అన్నారు.
ALSO READ : రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే సస్పెండ్ అయినట్టే..!
రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుస్తం:
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. సన్నబియ్యం, రేషన్ కార్డులతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా గెలుపునకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
