Venkatesh-Trivikram: 'ఆదర్శ కుటుంబం' రన్‌టైమ్ ఫిక్స్... వెంకీ మామ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

Venkatesh-Trivikram: 'ఆదర్శ కుటుంబం' రన్‌టైమ్ ఫిక్స్... వెంకీ మామ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కథలకు తనదైన శైలిని జోడించే వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజమే. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ గా ఈ సినిమా రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో మరోసారి చర్చ మొదలైంది.

రన్‌టైమ్ ఎంతంటే?

'ఆదర్శ కుటుంబం' నిడివి 149 నిమిషాలు.. అంటే 2 గంటల 29 నిమిషాలుగా నిర్ణయించారు. రెండున్నర గంటల లోపే సినిమాను పూర్తి చేయడం ప్రేక్షకులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సినిమా టాక్ బాగుంటే అదనపు షోలు పెంచేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. అయితే, షోల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

►ALSO READ | నందమూరి బాలకృష్ణ కోసం మరో పవర్‌ఫుల్ కథ రెడీ.. శివ నిర్వాణ ఎంట్రీతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..
విడుదలకు సమయం దగ్గరపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కుటుంబ అనుబంధాలు, కామెడీ, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాలను మేళవించిన కథతో త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వెంకటేశ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

భారీ తారాగణంతో సందడి..

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. వెంకీ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మాటల మాయ తోడైతే థియేటర్లలో నవ్వులు, భావోద్వేగాలు పండటం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరి 'ఆదర్శ కుటుంబం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో అక్టోబర్ 30న తేలనుంది..