నందమూరి బాలకృష్ణ కోసం మరో పవర్‌ఫుల్ కథ రెడీ.. శివ నిర్వాణ ఎంట్రీతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

నందమూరి బాలకృష్ణ కోసం మరో పవర్‌ఫుల్ కథ రెడీ.. శివ నిర్వాణ ఎంట్రీతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

 నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోరు మీదున్నారు . వరుస సెన్సేషనల్ హిట్స్‌తో రికార్డులు తిరగరాస్తున్న బాలయ్య, తన తదుపరి ప్రాజెక్ట్‌లతో నెవర్ బిఫోర్ కాంబినేషన్లకు శ్రీకారం చుడుతున్నారు.  ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' శరవేగంగా షూటింగ్‌జరుపుకుంటోంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు శివ నిర్వాణ కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మైసూర్‌లో బాలయ్యతో శివ భేటీ..

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' షూటింగ్‌లో పాల్గొంటున్న బాలకృష్ణను దర్శకుడు శివ నిర్వాణ మైసూర్‌లో కలిశారట. షూటింగ్ విరామ సమయంలో ఓ ఆసక్తికరమైన కథాంశాన్ని సింగిల్ లైన్‌లో వినిపించగా, బాలయ్యకు ఆ ఐడియా నచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి కథను హైదరాబాద్‌కు తిరిగొచ్చాక వినిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి సినిమాలతో భావోద్వేగభరిత కథలను తెరకెక్కించడంలో గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేస్తున్నారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల రవితేజతో ఆయన తెరకెక్కించిన 'ఇరుముడి' విజయంతో కొత్త ప్రాజెక్టులపై అంచనాలు మరింత పెరిగాయి.

NBK 112.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మరోవైపు బాలకృష్ణ కెరీర్‌లో 112వ చిత్రంగా తెరకెక్కనున్న NBK 112పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు రాజకీయ నేపథ్యమున్న కథగా ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సంగీత దర్శకుడి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

►ALSO READ | Donga Na Koduku Song: 'ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ' .. మౌళి 'దొంగ నా కొడుకు' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!