రష్యాలో క్లీనింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి ఓ యువకుడిని మోసం చేశారు ఏజెంట్లు. కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్ కుమార్ అనే యువకుడిని క్లీనింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి రష్యాకు తీసుకెళ్లి ఉక్రెయిన్ సరిహద్దులు పంపించారు ఏజెంట్లు. రాజ్ కుమార్ రష్యాలో చిక్కుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.
రష్యాకు వెళ్లిన తర్వాత పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారని..15 రోజులు శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుల వైపు తరలిస్తున్నారని తండ్రి రాజయ్యకు వాయిస్ మెసేజ్ పంపాడు రాజ్ కుమార్.
తనతో పాటు పలువురు యువకులు కూడా రష్యాలో చిక్కుకున్నట్లు వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నాడు రాజ్‌కుమార్. మరో మూడు నెలల వరకు ఫోన్ అందుబాటులో ఉండదని తెలిపాడు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు పరిస్థితి తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. రాజ్‌కుమార్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్న కుటుంబ సభ్యులు.
