అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 5.1 తీవ్రత నమోదు

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 5.1 తీవ్రత నమోదు

న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. గురువారం (అక్టోబర్ 29) మధ్యాహ్నాం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. బాంబూ ఫ్లాట్‌కు 218 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో  భూకంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 

భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదు. భద్రతా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహకయ చర్యలు చేపట్టారు. 

ఇటీవలి నెలల్లో అండమాన్ మరియు నికోబార్ దీవులలో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. 2026, ఫిబ్రవరి 2వ తేదీన కూడా భూకంపం ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 4.6గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.