రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే సస్పెండ్ అయినట్టే..! పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు వార్నింగ్

రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే సస్పెండ్ అయినట్టే..! పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు వార్నింగ్

ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. అయితే, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వల్ల స్థానం దక్కని రెబల్ అభ్యర్థులు కూడా పలు చోట్ల నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రెబల్ అభ్యర్థులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే సస్పెండ్ అయినట్టేనని.. కూటమి పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని అన్నారు చంద్రబాబు.

స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు చంద్రబాబు.ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. ఆ తర్వాత ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూటమి పార్టీలు ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు చంద్రబాబు.

ALSO READ : పోలీసులు, లాఠీఛార్జీలకు భయపడొద్దు

ఇదిలా ఉండగా.. నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన నెలకొంది. నామినేషన్ల వేళ ఘర్షణలు జరిగిన సమయంలో ప్రేక్షక పాత్రకే పరిమితమైన పోలీసులు పోలింగ్ రోజైనా ఘర్షణలు జరగకుండా అడ్డుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.