కాస్ట్లీ బైక్లనే ఎత్కపోతరు.. హైదరాబాద్ల కొట్టేసి రాజమండ్రిల అమ్ముతరు !

కాస్ట్లీ బైక్లనే ఎత్కపోతరు.. హైదరాబాద్ల కొట్టేసి రాజమండ్రిల అమ్ముతరు !

రాయల్​ఎన్ఫీల్డ్, కేటీఎం బైకులే టార్గెట్..    
ఇండ్ల ముందు పెడితే మాయమే!
 అరెస్ట్​ చేసిన చందానగర్​ పోలీసులు

చందానగర్​, వెలుగు : ఇండ్ల ముందు పార్క్​చేసిన కాస్ట్​లీ బైక్​లను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న కొందరు స్టూడెంట్స్​ను చందానగర్‌‌ పోలీసులు అరెస్ట్​చేశారు. ఐదుగురిని పట్టుకుని వారి నుంచి నాలుగు టూ వీలర్లు, 11 నకిలీ నంబర్‌‌ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్​ పీఎస్​లో ఆర్సీపురం ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న అర్ధరాత్రి చందానగర్​ హుడా కాలనీకి చెందిన సాఫ్ట్​వేర్​ఉద్యోగి అడెపు అజయ్​ ఇంటి ముందు రాయల్​ఎన్​ఫీల్డ్​ పార్క్​చేయగా, తెల్లారే వరకు కనిపించలేదు. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ నెల 27న లింగంపల్లి రైల్వే స్టేషన్‌‌ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి బైక్‌‌ వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించి పట్టుకుని విచారించగా రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ క్లాసిక్‌‌ 350 బైక్‌‌ను దొంగిలించింది తామేనని ఒప్పుకున్నారు. లోతుగా విచారించగా అసలు విషయాలు వెల్లడించారు. చెన్నైలో బీటెక్​ చదువుతున్న రాజమండ్రికి చెందిన గడ్డం ప్రవీణ్‌‌ (21), స్టూడెంట్స్​అయిన గీసాల షణ్ముఖ సత్యసాయి (21), సీరపు దినేశ్‌‌ కుమార్‌‌ (22), మరో ఇద్దరు ప్రైవేట్​ఉద్యోగులైన  బురిడి గోపీచంద్‌‌ (20), చోడవరపు దినేశ్‌‌ కుమార్‌‌ (22)తో కలిసి కాస్ట్​లీ బైక్​లను దొంగిలిస్తున్నట్టు తేలింది. 

రాజమండ్రి నుంచి సిటీకి వచ్చి అమీర్​పేట్​లోని ఒక హాస్టల్​లో ఉంటూ ఈ పనులు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌‌ 2025 నుంచి బండ్లను దొంగిలిచి నకిలీ నంబర్‌‌ ప్లేట్లు అమర్చి రాజమండ్రికి షిఫ్ట్​చేసి అమ్ముకుంటున్నారు. వీరి నుంచి రూ. 12 లక్షల విలువైన మూడు రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ బైక్‌‌లు, కేటీఎం డ్యూక్‌‌ సహా మొత్తం నాలుగు బండ్లను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వాహనాలు దొంగతనం చేశారనే అనుమానం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు. చందానగర్​ సీఐ శ్రీధర్​, డీఐ నవీన్​, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్ విజయ్​పాల్గొన్నారు.