- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: బ్రేక్పాస్ట్ పథకాన్ని సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని, జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ పథకం అమలు అయ్యేలా చొరవ చూపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన హాస్టల్స్అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. స్కూల్స్ ప్రారంభమై ఆర్నేల్లైనా విద్యార్థులకు యూనిఫామ్ లు అందడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం లో క్షేమంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు ఇప్పుడు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు.
టెన్త్స్టూడెంట్లకు ప్రత్యేక ట్యూటర్స్ ఉంటారని వారికి 15 నెలల నుంచి జీతాల్లేవన్నారు. 580 మంది విద్యార్థులు బెస్ట్ అవలేబుల్ స్కూల్స్ కి ఎంపిక కాగా, నేటికీ పాఠశాలకు నిధులు రాక విద్యార్థుల మీద భారం వేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గం లో పంచాయతీ రాజ్ శాఖలో మూడేళ్లలో రూ.300 కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని హరీశ్ రావు అన్నారు.
