వాల్మీకి ఆశయాలు సమాజానికి మార్గదర్శకం : నీలం మధు ముదిరాజ్

వాల్మీకి ఆశయాలు సమాజానికి మార్గదర్శకం : నీలం మధు ముదిరాజ్
  • మెదక్​ పార్లమెంట్ ​కాంగ్రెస్​ ఇన్​చార్జి నీలం మధు ముదిరాజ్​

కంగ్టి, వెలుగు: వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను యువతకు పరిచయం చేస్తూ, వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం చాప్టా (కె) గ్రామంలో బుధవారం నిర్వహించిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 

వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. కార్యక్రమంలో సర్వేశ్వర అంబికా శివయోగి మహారాజ్, గుండు లక్ష్మణ్, గుండు మోహన్, సత్యనారాయణ, కౌన్సిలర్ రామకృష్ణ, సర్పంచులు శివరాజ్ పటేల్, కృష్ణ, సాయిలు పటేల్, వెంకటేష్, భూమయ్య, నాయకులు ప్రకాష్ రాథోడ్, వెంకట రాములు, రవి, వెంకన్న, ముచందర్, వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.