ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామ శివారులోని సరిహద్దుల్లో బుధవారం డివిజనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్వంశీ ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు భూముల రీ సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన శివారు వెంకటాపూర్ గ్రామస్తులు ఎర్రవల్లి పరిధిలోని సర్వే నంబర్ 325 సరిహద్దుల్లోని 136 ఎకరాల భూమిని సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు 38, 41, 45, 47, 85, 88, 100లో ఉన్న 136 ఎకరాల భూములను సర్వే చేయాలని వారు పట్టుబట్టారు. దీనిపై అధికారులు స్పందిస్తూ వివాదంలో ఉన్న భూములను తర్వాత సర్వే చేస్తామని చెప్పారు.
కాగా, సర్వే నంబర్ 325 సరిహద్దు భూములను సర్వే చేయకుంటే భూముల రీ సర్వేను అడ్డుకుంటామని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఈ సందర్భంగా భూముల సర్వేపై అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.
శివారు వెంకటపూర్ గ్రామానికి శివారు చూపియాలని గ్రామస్తులు అధికారులను కోరారు. కాగా, సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, గ్రామస్తుల విన్నపాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని సర్వేకు వచ్చిన అధికారులు తెలిపారు.
