హైదరాబాద్లో ఇవాల (అక్టోబర్ 29) 37 కేంద్రాల్లో మహా రక్తదాన యజ్ఞం

హైదరాబాద్లో ఇవాల (అక్టోబర్ 29)  37  కేంద్రాల్లో మహా రక్తదాన యజ్ఞం

హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  గురువారం సిటీ కమిషనరేట్ పరిధిలోని 37  కేంద్రాల్లో మెగా రక్తదాన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. 

రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా, క్యాన్సర్ రోగుల ప్రాణాలను నిలపడంలో రక్తదానం ఎంతో కీలకమని, ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నీరసం రాకపోగా ఆరోగ్యం మెరుగుపడుతుందని సీపీ సజ్జనార్​ స్పష్టం చేశారు.