విద్యా ప్రమాణాలు పెంచేందుకే వ్యాలిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్ : ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ 

విద్యా ప్రమాణాలు పెంచేందుకే వ్యాలిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్ : ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడం, బోధన–పరీక్షల్లో విద్యా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యాలిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనలను తీసుకొచ్చినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నూతన నిబంధనలపై నిర్వహించిన రెండ్రోజుల రాష్ట్రస్థాయి ప్రత్యక్ష వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లెక్చరర్ల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

తొలిసారిగా ప్రభుత్వ, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీల లెక్చరర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. మొత్తం 24 సబ్జెక్టులపై నిర్వహించిన ఈ వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్జెక్టు నిపుణులు పాల్గొని బోధన, మూల్యాంకన విధానాల్లో ఏకరూపత తేవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. ఈ సదస్సులో ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 4,193 మంది, గురుకులాలు తదితర ప్రభుత్వ రంగ కాలేజీల నుంచి 5,808 మంది, ప్రైవేటు కాలేజీల నుంచి 4,271 మంది లెక్చరర్లు పాల్గొనట్టు వెల్లడించారు. లెక్చరర్లు తమ సందేహాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు వీలుగా, ఈ రెండు రోజుల వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రికార్డెడ్ వీడియోలను త్వరలోనే టీజీ బీఐఈ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. 

 

మరిన్ని వార్తలు