కోల్బెల్ట్: శాంతిఖని గనికి ఈసీ పొడిగింపు.. 681.23 హెక్టార్లలో యథావిధిగా కొనసాగుతున్న కార్యకలాపాలు

కోల్బెల్ట్: శాంతిఖని గనికి ఈసీ పొడిగింపు.. 681.23 హెక్టార్లలో యథావిధిగా కొనసాగుతున్న కార్యకలాపాలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతిఖని లాంగ్​వాల్ ప్రాజెక్టు అండర్​గ్రౌండ్​ కోల్​మైన్​కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ రీవాలిడేషన్ ఎన్విరాన్​మెంట్ క్లియరెన్స్ (ఈసీ)ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం అకెనపల్లి సమీపంలో శాంతిఖని ఏర్పాటైంది. ప్రస్తుతం గని లాంగ్​వాల్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. లాంగ్​వాల్ ప్రాజెక్టుకు వార్షిక బొగ్గు ఉత్పత్తి కెపాసిటీ 0.8 మిలియన్ టన్నుల నుంచి 1.167 మిలియన్ టన్నులకు పెంచుతూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 24 జనవరి 2006న పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. 

ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​ ప్రకారం శాంతిఖని గనిలో ఏటా 1.16 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కెపాసిటీతో లీజ్​కు తీసుకున్న 681.23 హెక్టార్లలో బొగ్గు ఉత్పత్తి చేపట్టింది. ఈ దశలో గని ఎన్విరాన్​మెంట్ పర్మిషన్ గడువు ముగియడంతో 2018 పర్యావరణ చట్టం ప్రకారం పర్మిషన్ పునరుద్ధరణ కోసం సింగరేణి యాజమాన్యం గతేడాది మార్చి 6న ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అనుమతులు లభించాయి. దీంతో గనికి కేటాయించిన 681.23 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ తెలిపారు.