- సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించరాదని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆర్టీఐ కమిషనర్లు పీవీ.శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి మెర్ల, కలెక్టర్ కె.హరితతో కలిసి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అప్పిలేట్, ప్రజా సమాచార, సహాయ ప్రజా సమాచార ఆఫీసర్లు ఆర్టీఐపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తుదారులకు సరైన సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం పారదర్శకంగా, సరళీకృతంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆర్టీఐ అప్పీళ్లపై హియరింగ్ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి పాల్గొన్నారు.
