జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యురాలు లకావత్ లక్ష్మి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు కలీం పాషాలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు పార్టీ మల్హర్ మండల అధ్యక్షుడు జంగడి శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని అధిష్టానం ఆదేశాల మేరకే సస్పెండ్ చేసినట్టు బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
