హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్(జేసీఎల్) సునీతా గోపాల్ దాస్ తారుమారు చేశారని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) కూటమి నేతలు ఆరోపించారు. ఆమెను వెంటనే బర్తరఫ్చేయాలని డిమాండ్‌చేస్తూ బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని లేబర్ కమిషనర్ ఆఫీస్ఎదుట ధర్నా చేపట్టారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఈయూ, ఎన్ఎంయూ, టీఎంయూ నేతలు ఎస్.బాబు, ఈదురు వెంకన్న, టీఎంయూ కార్యదర్శి థామస్ రెడ్డి, ఎన్ఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్, ఇతర నేతలు, కార్మికులు హాజరయ్యారు.
