దీపావళి కానుకలపై ట్యాక్స్ పడుతుందా? ఆదాయపు పన్ను రూల్స్ తెలుసుకోండి!

దీపావళి కానుకలపై ట్యాక్స్ పడుతుందా? ఆదాయపు పన్ను రూల్స్ తెలుసుకోండి!

దీపావళి పండుగ అనగానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వడం, డబ్బు రూపంలో కానుకలు పంచుకోవడం సర్వసాధారణం. అయితే ఇలా వచ్చే క్యాష్ కానుకలపై ఆదాయపు పన్ను నిబంధనలు ఎలా వర్తిస్తాయనే అంశంపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బంధువుల నుంచి పొందే నగదు బహుమతులపై ఎంత మొత్తమైనా ఎలాంటి టాక్స్ కట్టక్కర్లేదు. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు లేదా పిల్లలు ఈ జాబితాలోకి వస్తారు. వీరు ఇచ్చే దీపావళి కానుకల విలువ ఎంత ఉన్నా.. అవి పూర్తిగా పన్ను రహితమే.

ఇక స్నేహితులు, సహోద్యోగులు, పక్కవారూ, ఇతర బంధువులు కాని వారి నుంచి ఏడాదిలో అందుకునే మొత్తం క్యాష్ బహుమతుల విలువ రూ.50వేలు దాటకూడదు. ఈ పరిమితి ఒక్కరి నుంచి కాకుండా.. అందరినీ కలిపి ఏడాదికి వర్తిస్తుంది. అంటే అందరి నుంచి వచ్చే మెుత్తం క్యాష్ గిఫ్ట్స్ విలువ రూ.50వేలు మించకూడదు. ఒకవేళ మొత్తం విలువ రూ.50వేలు దాటితే.. పూర్తి మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. దీనిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కేటగిరీ కింద పరిగణించి.. మీకు వర్తించే టాక్స్ స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.

బంధువుల నుంచి బహుమతి రూపంలో పన్ను లేని మొత్తాన్ని అందుకున్నప్పటికీ.. ఫిజికల్ క్యాష్ విషయంలో మరో కీలక నిబంధన ఉంది. ఒక వ్యక్తి నుంచి ఒక్క రోజులో.. ఒకే లావాదేవీలో లేదా ఒకే సందర్భంలో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోకూడదు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే.. తీసుకున్న క్యాష్ గిఫ్ట్ మెుత్తానికి సమానంగా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఇచ్చే కానుకలను బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా ఇవ్వడం సేఫ్. 

ALSO READ : కస్టమర్లకు SMS రాకుండానే అకౌంట్స్ ఖాళీ

దీపావళికి నగదు రూపంలో బహుమతులు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల నుంచి వచ్చే కానుకల మొత్తం ఏడాదికి రూ.50వేలకు మించకుండా చూసుకోవాలి. ఒకవేళ పెద్ద పేమెంట్స్ బహుమతిగా ఇస్తే నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరగాలి. భవిష్యత్తులో పన్ను అధికారుల నుంచి ఎలాంటి సందేహాలు రాకుండా గిఫ్ట్ ఇచ్చిన వారి వివరాలు, వారితో ఉన్న సంబంధం వంటి రికార్డులను జాగ్రత్తపరుచుకోవటం మంచిది.