ఆధ్యాత్మికం :యోగం అంటే ఏమిటి..భగవంతుడిని ఎలా చేరుకుంటారు..!

ఆధ్యాత్మికం :యోగం అంటే ఏమిటి..భగవంతుడిని ఎలా చేరుకుంటారు..!

మన మనసు రజోగుణంతో ఉండి చంచలమైన స్వభావం కలది. ఈ చంచలత్వాన్ని తగ్గించడం కోసం చెప్పిన ఉపాయమే యోగం. రోజు చేసే వ్యాయామంలా బాడీబిల్డింగ్ కోసం చేసేది కాదు యోగా అసలు స్వరూపం కాదు. దీనితో మనసు రజోగుణం పెరుగుతుందే కాని తగ్గదు. యోగ సాధకుడి మనసు నిర్మలంగాను, నిశ్చలంగాను ఉండాలి. 

ఆసనం అంటే ఒంటికాలిపై నిల్చోవడమో లేదా అరచేతిపై శరీరాన్ని నిలబెట్టడమో కాదు, జిమ్నాస్టిక్ విన్యాసాలు అసలే కాదు ఆసనం స్థిరమైన భంగిమలో ఉండాలి. శరీరానికి సుఖాన్నిచ్చేట్లుగా ఉండాలి. శరీరాన్ని మరచిపోయేలా, మనసుతో యోగాన్ని అనుభూతించేలా ఆసనం ఉండాలని పతంజలి యోగ సూత్రాలలో చెప్పారు.

యోగా అంటే ఆసనాలు వేయటం  మాత్రమే కాదు. శాస్త్రంలో నిషే ధించబడిన పనుల్ని చేయకుండా ఉండటం. తనకు విధించిన కర్తవ్యాన్ని చేయడం. ఫలాపేక్ష లేకుండా భగవంతుని ఆజ్ఞగా, కేవలం నా విధి అనే దృష్టితో సమాజ శ్రేయస్సు కోసం కర్మలని చేయడం. ఇదే కర్మయోగం. 

కర్మయోగం వల్ల మనసు కొంత వరకు ప్రశాంతంగా అవుతుంది. కానీ, ఏకాగ్రత సాధ్యం కాదు. ఏకాగ్రత సాధించ దానికి చెప్పిన సాధనమే ప్రస్తుతం మనం చేస్తున్న యోగం. అంటే యోగంలోని ఉన్నత స్థానానికి చేరుకోవటానికి చేసే వామప్ లాంటిదే మనం శరీరంతో చేసే యోగా. ఇది చాలా ప్రాథమిక మైనది. 

కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి చెప్పిన సాధనాల్లో యోగం కూడా ఒకటి. శ్వేతా శ్వతర ఉపనిషత్తు రెండో అధ్యాయం యోగాస నాల్ని వర్ణిస్తుంది. ఈ వర్ణన భగవద్గీతలోని ఆరో అధ్యాయం ధ్యానయోగంలో చెప్పిన విషయాన్ని పోలి ఉంటుంది. అంటే యోగం గురించి తెల్సుకో వాలంటే కచ్చితంగా పురాణ, ఉపనిషత్తుల మీద కొంత అవగాహన ఉండాలి. 

యోగా అంటే రోజూ చేసే జిమ్, వ్యాయామం లాంటిది కాదు. శరీరాన్ని, మనసును కూడా ఏకం చేయగల అద్భుతమైన సాధనం యోగం. పతంజలి మహర్షి యోగానికి అంగాలు ఎనిమిది అని పేర్కొన్నారు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి'యోగాలు.

1. యమ:  అహింస, సత్యవాక్పాలన, దొంగతనం చెయ్యకపోవడం, బ్రహ్మచర్యం, ఎవరినీ యాచిం చకపోవడం.
2. నియమ: బాహ్యాంభ్యంతర శుద్ధి, దొరికిన దానితో తృప్తి, తపస్సు, వేదాధ్యయనం, భగవధ్యానం.
3. ఆసన:  కాసేపు ఒకచోట నిలకడగా కూర్చోగలగడం.
4. ప్రాణాయామం:  శ్వాసను లయబద్ధం చేయడం. లయబద్ధంగా ఉండే శ్వాస మనసును ప్రశాంత
పరుస్తుంది.
5.ప్రత్యాహారం:  బాహ్య ప్రపంచంలోని వస్తువులు. పదార్థాలనుండి ఇంద్రియ అవయవాలను మరల్చి అంతర్ముఖం కావించడం.
6.ధారణ: ఒక వస్తువుపై మనసును స్థిరంగా వుంచడం.
7.ధ్యానం: ఏకాగ్రం చేసిన వస్తువుపై అవిచ్ఛిన్న ధారగా చేసే భావనా ప్రవాహమే ధ్యానం.
8.సమాధి: పైన ఏడు దశలనూ దాటినవారు పరమా త్మ తత్వాన్ని, జీవపరమార్థాల ఏకతనీ తెలుసుకోగ లుగుతారు అదే సమాధి స్థితి.

ఈ విధంగా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూవచ్చే సాధకుడు యోగాన్ని సాధిస్తాడు. యోగి అవుతాడు. యోగి అంటే అన్నీ వదిలివేసినవాడు అనే అభిప్రాయమే వాడుకలో ఉంది. కానీ అత్యు న్నత స్థితిని పొందినవాడు అని నిజమైన అర్ధం. సాధకుడు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం .. చేరుకోవడం అనేది యోగా ప్రధాన ఉద్దేశమని పండితులు చెబుతున్నారు.