క్యాన్సర్ రోగులకు మళ్లీ నిరాశే.. సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని డ్రగ్ కంపెనీలు

క్యాన్సర్ రోగులకు మళ్లీ నిరాశే..  సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని డ్రగ్ కంపెనీలు

క్యాన్సర్ రోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టు చెప్పినా కూడా డ్రగ్ కంపెనీల తీరు మారకపోవడం క్యాన్సర్ బాధితులకు శాపంలా మారింది. లేటెస్టుగా ప్రకటించి కొత్త మందుల ధరల జాబితా  బాధితులకు శోకమే మిగిల్చిందని చెప్పాలి.

కీలకమైన క్యాన్సర్ ఔషధాల ధరల్లో ఎటువంటి మార్పూ లేదన్న ఎన్‌పీపీఏ (NPPA) పేర్కొంది. సవరించిన గరిష్ట రిటైల్ ధరలు (MRP) 2026 నవంబర్ 9 నుంచి అమలులోకి రానున్నాయి.  కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ మందుల ధరలు యథాతథంగా ఉండటంతో ఆర్థిక భారం కొనసాగనుంది. 

కేవలం ట్రేడ్ మార్జిన్ పరిమితులతో ఉపయోగం లేదని బాధితులు చెబుదున్నారు. కంపల్సరీ లైసెన్సింగ్ తక్షణమే అమలు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల నూతన ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఇప్పటి వరకు క్యాన్సర్ మందు అలెక్సాన్సా (Alecensa 150 mg) ధర 4 లక్షల 30 వేల రూపాయలుగా ఉంది. ధరల్లో మార్పు లేదని ప్రకటించడంతో అదే ధర కొనసాగనుంది. అదే విధంగా ఇమ్యునోథెరపీ మందు కిట్రుడా  (Keytruda 100 mg) ధర రూ. 2 లక్షల16 వేలు ఉండనుంది. రొమ్ము క్యాన్సర్ ఔషధం ఫెస్గో (Phesgo 1200 mg) ఉమ్మడి డోస్ ధర 4 లక్షల 93 వేలుగా అదే ధర కొనసాగనుంది. దీంతో బాధితులపై తీవ్ర భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం 37 పేటెంట్ క్యాన్సర్ ఔషధాల ధరల్లో ఎలాంటి మార్పు లేదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ  నిపుణులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల జాబితాను విడుదల చేసింది  NPPA.