ఐపీఎల్‌లో డబ్బుల వర్షం: రూ.17,500 కోట్లతో ముంబై టాప్.. ఇతర జట్ల విలువ ఎంతో తెలుసా?

ఐపీఎల్‌లో డబ్బుల వర్షం: రూ.17,500 కోట్లతో ముంబై టాప్.. ఇతర జట్ల విలువ ఎంతో తెలుసా?

IPL Team Valuations: గ్లోబల్ స్పోర్ట్స్ బిజినెస్ రీసెర్చ్ సంస్థ స్పోర్టికో (Sportico) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాండ్ విలువ ప్రపంచంలోనే ఏ ఇతర స్పోర్ట్స్ లీగ్‌కు లేని స్థాయిలో ఆకాశాన్నంటింది. ఐపీఎల్ లీగ్‌లోనే ముంబై ఇండియన్స్ (MI) అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా అగ్రస్థానంలో నిలవగా.. ఆమెరికా డాలర్ల ప్రకారం దీని ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్ ఏకంగా $2.1 బిలియన్లు (సుమారు రూ. 17,500 కోట్లు)గా నమోదైంది. ప్రస్తుతం ఐపీఎల్‌లోని ప్రతీ ఫ్రాంచైజీ కనీస విలువ $1.5 బిలియన్లను (రూ. 12,500 కోట్లు) దాటగా.. లీగ్‌లోని సగటు ఫ్రాంచైజీ విలువ $1.7 బిలియన్లకు (రూ. 14,100 కోట్లు) చేరుకోవడం గమనార్హం. 

ఐపీఎల్ బిజినెస్ మోడల్: 

* 1800శాతం ఎగబాకిన ఫ్రాంచైజీ విలువలు: 2008లో ప్రారంభమైనప్పుడు ఐపీఎల్ ఎనిమిది జట్ల మొత్తం విలువ $724 మిలియన్లు మాత్రమే కాగా.. 2026 నాటికి ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ఏకంగా 1800 శాతం పెరిగింది.

* బీసీసీఐ మీడియా రైట్స్ సెంట్రల్ రెవెన్యూ: 2023–27 సైకిల్ కోసం బీసీసీఐ కుదుర్చుకున్న $6.2 బిలియన్ల మీడియా రైట్స్ డీల్ ద్వారా ప్రతీ ఫ్రాంచైజీకి ఏటా $50 మిలియన్ల నుంచి $55 మిలియన్ల వరకు (రూ. 400+ కోట్లు) ఆదాయం నేరుగా సమకూరుతోంది.

* భారీ వ్యూయర్‌షిప్: 2026 సీజన్‌లో ఐపీఎల్ డిజిటల్, టీవీ ప్లాట్‌ఫామ్‌లలో 1.2 బిలియన్ల కంటే ఎక్కువ యునీక్ వ్యూయర్‌షిప్ సాధించింది. ప్రతీ జట్టు సాలరీ క్యాప్ $16 మిలియన్లుగా (రూ. 133 కోట్లు) ఉండటం వల్ల మేనేజ్‌మెంట్ ఖర్చులు అదుపులో ఉంటూ లాభాల బాట పడుతున్నాయి.

* భారీ ఇన్వెస్ట్‌మెంట్లు: ఇటీవల ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్‌స్టోన్ లాంటి దిగ్గజాలు ఆర్‌సీబీ (RCB) ని $1.78 బిలియన్లకు దక్కించుకోగా.. లక్ష్మీ మిట్టల్, అదార్ పూనావాలా కాన్సార్టియం రాజస్థాన్ రాయల్స్ (RR) ను $1.65 బిలియన్లకు దక్కించుకోవడంతో క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

  • ఫ్రాంచైజీ పేరు                                               వాల్యుయేషన్ (USD)                       ఇండియన్ కరెన్సీలో (అంచనా)
  • ముంబై ఇండియన్స్ (MI)                                  $2.10 బిలియన్లు                          ₹17,500 కోట్లు
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)          $1.85 బిలియన్లు                          ₹15,400 కోట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్ (CSK)                                $1.75 బిలియన్లు                          ₹14,500 కోట్లు
  • కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)                              $1.73 బిలియన్లు                          ₹14,400 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్ (DC)                                          $1.70 బిలియన్లు                          ₹14,100 కోట్లు