సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లు, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరించే ఆయన.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిరంజీవి చేతులు కలిపారు. ఈ షోకు 'మెగావర్స్' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని లేటెస్ట్ గా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం మొదలైంది.
నిజానికి చిరంజీవితో ఓ ప్రత్యేకమైన షో చేయాలని నెట్‌ఫ్లిక్స్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మెగాస్టార్‌తో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. చివరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. టాక్ షో ఫార్మాట్‌లో రూపొందనున్న ఈ 'మెగావర్స్'లో చిరంజీవి హోస్ట్‌గా సందడి చేయనున్నారు. సెలబ్రిటీలతో ఆయన చేసే సరదా సంభాషణలు, తెరవెనుక విశేషాలు, ఆసక్తికరమైన అనుభవాలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
చిరంజీవికి ఇలా హోస్టింగ్ కొత్తేమీ కాదు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి తన మాటలతో, చమత్కారంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ షోకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చిరంజీవి ప్రారంభించారు. అయితే ఈ షో తొలి ఎపిసోడ్‌లో ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి కామెడీకి చిరంజీవి చమత్కారం తోడైతే వినోదం ఏ స్థాయిలో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : ఈ వారం డబుల్ ఎలిమినేషన్? డేంజర్ జోన్‌లో ఇద్దరు.. హౌస్‌లో ఉత్కంఠ!
ఇప్పటికే బాలకృష్ణ, జగపతిబాబు వంటి ప్రముఖులు టాక్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి 'మెగావర్స్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొందరు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పూర్తి అతిథుల జాబితా, ఎపిసోడ్ల వివరాలను నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే వెల్లడించనుంది.
Mass ki grammar, style ki definition. Megastar is here. 👑❤️ Watch Chiranjeevi’s Megaverse, coming soon, Only on Netflix. #MegaverseOnNetflix https://t.co/cJxt5MrcCj
— Netflix India South (@Netflix_INSouth) October 29, 2026
