ఈ వారం ప్రారంభం నుంచి రోజూ కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు గురువారం రోజున బ్రేక్ తీసుకున్నాయి. అయితే ఇదే క్రమంలో వెండి రేట్లు మరింతగా పతనం కావటం కొనుగోలుదారులకు భారీగా ఊరటను అందించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించటంతో బులియన్ మార్కెట్లపై కొంత ఒత్తిడి తగ్గిందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి ముందుకు సాగటం బెటర్.
అక్టోబర్ 29న బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 395గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 195గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 29, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 15వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.215 దగ్గర ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న మరికొద్ది రోజుల్లో వెండి రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
