ఎంపీలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ.. రూ.2,800 కోట్లతో నిర్మించనున్న స్పిన్ట్రానిక్స్

ఎంపీలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ.. రూ.2,800 కోట్లతో నిర్మించనున్న స్పిన్ట్రానిక్స్

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సెమీకండక్టర్ డిజైన్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సంస్థ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్స్ ఏఐ మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరం ఉజ్జయినిలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది.  అక్కడి  ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్లాంటు ప్రాంతాన్ని సంస్థ బృందం పరిశీలించింది. యూనిట్​ ఏర్పాటుకు సుమారు రూ.2,800 కోట్ల భారీ పెట్టుబడి అవసరమని తెలిపింది. 

ఫ్యాక్టరీకి అవసరమైన వాతావరణం, నీరు, కరెంటు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తున్నామని ప్రకటించింది.  ప్రాజెక్టు పూర్తయితే వెయ్యి మందికి ప్రత్యక్షంగా, 2,800 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓఐ) కూడా జారీ చేసిందని సంస్థ 
సీఈఓ రఘు వర్మ తెలిపారు.