- ధరలు పెంచిన హిందుస్తాన్ యూనిలీవర్
న్యూఢిల్లీ: ముడిసరుకుల ఖర్చుల భారం వల్ల సెప్టెంబర్క్వార్టర్లో తమ ఉత్పత్తుల ధరలను 7.5 శాతం పెంచామని ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది.
వీటిలో సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్లు, లక్స్, లైఫ్‌బాయ్, డవ్, పియర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా సబ్బులు, బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్, తాజ్ మహల్, తాజా, లిప్టన్ టీ పౌడర్లు, పాండ్స్, గ్లో అండ్ లవ్లీ, వాజిలిన్, లాక్మే వంటి స్కిన్‌కేర్ ప్రొడక్టులు, క్లినిక్ ప్లస్, సన్‌సిల్క్, డవ్, ట్రెసెమే షాంపూలు ఉన్నాయి.
భవిష్యత్తులోనూ ముడిసరుకుల ధరల ఆధారంగా రేట్లను పెంచుతామని ఎండీ సీఈఓ ప్రియా నాయర్ తెలిపారు. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకుంటూ లాభాలను పెంచుకోవడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.
