- శంషాబాద్‌లో 13 అక్రమ మోటార్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: తాగునీటి దుర్వినియోగం, సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడంపై జలమండలి అధికారులు సీరియస్యాక్షన్తీసుకుంటున్నారు. బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152లో ఇంటిని తాగునీటితో శుభ్రం చేస్తుండగా స్థానికులు జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో అధికారులు తనిఖీ చేసి రూ.5 వేల జరిమానా విధించారు. అలాగే, శంషాబాద్ జోన్, డివిజన్-8 కొత్వాల్‌గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించినట్లు గుర్తించి 13 మోటార్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. నీటి దుర్వినియోగాన్ని ఫొటోలు, వీడియోల తీసి 99499 30003 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
