న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. భారత్‌తో చివరి 2 T20లకు ఇద్దరు స్టార్ పేసర్లు ఔట్

న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. భారత్‌తో చివరి 2 T20లకు ఇద్దరు స్టార్ పేసర్లు ఔట్

India vs New Zealand: భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను 0–3 తేడాతో చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆతిథ్య కివీస్ జట్టులోని స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ద్వయం మ్యాట్ హెన్రీ (Matt Henry), లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గాయాల కారణంగా చివరి రెండు టీ20 మ్యాచ్‌ల నుంచి వైదొలిగారు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు పేసర్లు గాయపడినట్లు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ (Rob Walter) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఫెర్గూసన్, హెన్రీల గాయాలు:

* లాకీ ఫెర్గూసన్: రెండో టీ20లో పిక్క కండరాల గాయం (Calf Injury) బారిన పడిన ఫెర్గూసన్ కనీసం వారం రోజుల పాటు మైదానానికి దూరం కానున్నాడు.

* మ్యాట్ హెన్రీ: అదే మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి (Quad Injury) గురైన హెన్రీ కోలుకోవడానికి సుమారు రెండు వారాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. 

* కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. లాకీ, మ్యాట్‌లు దూరం కావడం మాకు చాలా బాధకరం.. అంతర్జాతీయ క్రికెట్‌లో గాయాలు సహజమే అయినా, కీలక మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం కష్టమే. అయితే నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series) నాటికి వీరిద్దరూ కోలుకుంటారని ఆశిస్తున్నామన్నాడు. 

ఆక్లాండ్ టీ20కి ముందు కివీస్‌కు నిరాశ:

రేపు (అక్టోబర్ 30, శుక్రవారం) ఆక్లాండ్‌లోని 'ఈడెన్ పార్క్' వేదికగా 40,000 మంది ప్రేక్షకుల మధ్య నాలుగో టీ20 జరగనుంది. స్వదేశీ మైదానంలో ఆడాలని ఉవ్విళ్లూరుతున్న ఫెర్గూసన్ దూరం కావడం కివీస్‌కు నిరాశ కలిగించే విషయమే. ఇప్పటికే మ్యాథ్యూ ఫిషర్ జట్టులోకి రాగా.. జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, బ్లేర్ టిక్నర్, జాక్ ఫౌల్కేస్‌లతో కూడిన పేస్ దళంతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.