HCA..లో పాలనాపరమైన సమస్యలు..ఎస్‌‌జీఎం నిర్వహించండి : సంఘం సభ్యులు

HCA..లో పాలనాపరమైన సమస్యలు..ఎస్‌‌జీఎం నిర్వహించండి : సంఘం సభ్యులు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)లో పాలనాపరమైన సమస్యలు, సమావేశాల నిర్వహణపై సంఘం సభ్యులు  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం అక్టోబర్ 21తో ముగిసిన నేపథ్యంలో.. కొత్త కార్యవర్గం ఎన్నిక కోసం వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌‌జీఎం) నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

ఈ మేరకు 108 మంది సభ్యుల సంతకాలతో సింగిల్ మెన్ కమిటీకి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.  ముందుగా ఎస్‌‌జీఎం నిర్వహించి.. అసోసియేషన్ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఏజీఎం నిర్వహించాలని కోరారు.  సంస్థకు సంబంధించిన ఆడిట్‌‌ను సక్రమంగా నిర్వహించడంతో పాటు.. అసోసియేషన్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు   నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.