ఢాకా: వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. షాద్మాన్ ఇస్లామ్ (99 బ్యాటింగ్), తౌహిద్ హ్రిదోయ్ (42) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 213/3 స్కోరు చేసింది. షాద్మాన్‌తో పాటు లిటన్ దాస్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్లలో షాద్మాన్ రాణించినా.. తంజిద్ హసన్ (7) నిరాశపర్చాడు.
మోమినల్ హక్ (28), నజ్ముల్ షాంటో (19) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా భారీ స్కోరు చేయలేకపోయారు. దాంతో 110 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను షాద్మాన్, తౌహిద్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 88 రన్స్ జోడించి తౌహిద్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. చివర్లో బ్యాడ్‌లైట్ కారణంగా ఆటను ముందుగానే ఆపేశారు. జోమెల్ వారికాన్ 2 వికెట్లు తీశాడు.
