హైదరాబాద్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు అంజన్న ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. గడిచిన 80 రోజుల్లో ఆలయానికి కోటి 23 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ నోట్లు 68 వచ్చాయి. ఆలయ ఈఓ ఎస్.అంజనారెడ్డి, ఏఈఓ , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమక్షంలో భారీ భద్రత నడుమ గురువారం (అక్టోబర్ 29) హుండీల లెక్కింపు పూర్తి చేశారు. ఆలయానికి గడిచిన 80 రోజుల్లో కోటి 23 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎస్.అంజనారెడ్డి తెలిపారు. లెక్కింపు సందర్భంగా వచ్చిన బంగారం, వెండిని తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
