ఏపీలో అర్నబ్ తుఫాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... రహదారులు ధ్వంసమయ్యి, విద్యుత్ స్తంభాలు కూలిపోయి.. చాలా గ్రామాల్లో అటు రాకపోకలు స్తంభించి విద్యుత్ లేక అంధకారంలోకి వెళ్లాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వంజంగి మేఘాల కొండకు వెళ్లే ప్రధాన రహదారి అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతినింది. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి, పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తుఫాన్ ప్రభావంతో అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల్లోనూ రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపడటం, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వంజంగి మేఘాల కొండకు వెళ్లే మార్గంలో పరిస్థితి పట్ల పర్యాటకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో దెబ్బతిన్న రహదారిని పరిశీలించి, కొండచరియలు, బండరాళ్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించేందుకు త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు.
